Monday, 29 January 2018

తమ్మలి కులం -- అనంతరామన్ కమీషన్ నివేదిక



మనమంతా మన తమ్మలి కుల అభివృద్ధి కోసం ప్రయత్నిద్దాం.
తమ్మలి కులస్తులు చేసే పనులు ఒకసారి చూద్దాం .
బాజా సన్నాయి వాయించడం
పూలు అల్లడం
అర్చకత్వం
ముఖ్యంగా మన తెలంగాణ లో మొదట అనంతరామన్ కమీషన్ 1970 లో నివేదిక ఇచ్చింది .
ఇందులో పేర్కొన్న విషయాలు :
తమ్మలి కులము చాలా చిన్నది. కేవలం నల్గొండ,మహబూబ్ నగర్ , కరీంనగర్ , నిజామాబాద్, మరియు ఆదిలాబాద్ లలోనే తమ్మలి కులస్తులు ఉన్నారు. ఈ కులాన్ని తమ్మెల్ల అనీ కరీంనగర్ లో పిలుస్తారు. ఈ ఐదు జిల్లాలోని వీరి జనాభా కేవలం 2000 మాత్రమే. వీరి సాంప్రదాయక వృత్తి సంగీత వాయించటం , పూలు అల్లటం మరియు ఆలయాలలో సేవ చేయడం .  ఆర్ధిక పరంగా వీరి చాలా పేదవారు. సగటున సంవత్సరానికి 400 - 600 రూపాయలు సంపాదిస్తారు. మాంసము , మద్యము తీసుకుంటారు. ఈ కులం లో ఉన్నత తరగతులు చదివేవారు లేరు.. విద్యా పరంగా చాలా చాలా వెనుకబడ్డారు. ఆర్థికంగా వెనుకబాటు, విద్యాపరంగా వెనుకబడటం, నాసిరకమైన వృత్తి వలన సమాజంలో వీరిని ఎవరూ కూడా గౌరవించేవారు కాదు. వీరి నాసిరకమైన జీవన విధానాలు, సమాజంలో వీరి స్థితి గతుల వలన , విద్యలో వీరి వెనుకబాటు  ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ తమ్మలి కులము ను కమిషన్ వెనుకబడిన కులముల జాబితాలో చేర్చడం జరిగినది.





ఈ కమిషన్ వారు తెలియచేయని విషయం అర్చకత్వం చేసేవాళ్ళలో కూడా తమ్మలి వాళ్ళు ఉన్నారు అని.
దీనికి కారణం అన్వేషిస్తే తెలుస్తుంది.
బహుశా అర్చకులంతా బ్రాహ్మణులు అనేమో మరి.


1 comment:

  1. Casino - Jammytown - Harrah's Kansas City
    Experience 안동 출장안마 the hottest 서울특별 출장안마 slots 군산 출장마사지 and video poker in KC! 과천 출장샵 Visit Harrah's 여주 출장마사지 Kansas City, Kansas City, Missouri for a thrilling stay, dining experience,

    ReplyDelete